జగన్ పాలనలోనే పల్లెల్లో నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్న సాయికిషోర్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతోనే రాష్ట్రంలో నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తులూరు సాయి కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు.