ఓయో హోటల్‌లో యువతి మృతి కేసులో సంచలన విషయాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: Telangana / Andhra Pradesh

ఓయో హోటల్ రూమ్‌లో యువతి షారన్ నిఖిత మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గదిలో బీర్, విస్కీ బాటిల్స్ పగిలిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెడ్‌తో పాటు గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. మృతురాలి ముఖం, శరీరంపైనే కాకుండా తల వెనుక భాగంలో కూడా తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.