ఈసీ నిర్ణయంపై నిరసనల హోరు: ముంబైలో జైల్ భరో ఆందోళనకు పిలుపు
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ముంబైలో జైల్ భరో ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించారని నివేదికలు వెల్లడించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. శివాజీ పార్క్ లో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించగా, ముంబై పోలీసులు నిరసనకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.