'భారీ మోసంలో బాధితుడిగా ట్రావిస్ కెల్స్': ఎన్ఎఫ్ఎల్ స్టార్‌ను నిండా ముంచిన సిద్ధార్థ్ జవహర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమెరికా
అమెరికాలో సంచలనం సృష్టించిన మిలియన్ల డాలర్ల పొంజీ స్కీమ్ మోసంలో ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ స్టార్, పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ భర్త ట్రావిస్ కెల్స్ బాధితుడిగా తేలినట్లు ఫెడరల్ కోర్టు విచారణలో వెల్లడైంది. సిద్ధార్థ్ జవహర్ నడిపిన ఈ భారీ మోసంలో కెల్స్ భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు ప్రాసిక్యూటర్లు ధృవీకరించారు. పెట్టుబడిదారులను మోసం చేసి విలాసవంతమైన జీవితం గడిపిన సిద్ధార్థ్ జవహర్‌కు కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు కోట్లాది రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.