ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు లాభాలు సాధించాలి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక్ కోరారు. బుధవారం జన్నారంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమకూర్చిన పెసర మరియు మినుము విత్తనాలను పలు గ్రామాల రైతులకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.