పర్యావరణ హితం కోసం మట్టి వినాయకుల పంపిణీ

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని లంకెలపాలెం, గంజిపేట, జిఎస్ నగర్, వినాయక నగర్ కాలనీలు మరియు అప్పికొండ చేలో ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 85వ వార్డు ఉపాధ్యక్షులు గంజి సురేష్ స్వయంగా పాల్గొని స్థానిక ప్రజలకు మరియు యువకులకు మట్టి ప్రతిమలను అందజేశారు. రసాయన విగ్రహాల వల్ల జరిగే హానిని వివరిస్తూ, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే పూజించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.