ధూల్‌పేటలో గణేష్ విగ్రహాల రవాణా: ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: Dhoolpet, Hyderabad
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేష్ విగ్రహాల విక్రయాలు, రవాణా దృష్ట్యా సెప్టెంబర్ 5 నుండి 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. బోయిగూడ కమాన్ నుండి గాంధీ విగ్రహం వరకు రోడ్లు మూసివేస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైతే 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చు.