రేవంత్ రెడ్డి భూములపైనా అధికారుల కమిటీతో విచారణ జరిపించాలన్న కేసీఆర్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న 460 ఎకరాల భూమిపై అధికారుల కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. భూభారతి పోర్టల్‌ను అప్పుడప్పుడు బంద్ చేసి వందల ఎకరాలు కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రేడ్ 9 బొగ్గు సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, సింగరేణితో యాదాద్రి ప్లాంట్‌కు ఒప్పందం ఉందని జెన్కో ఇంజనీర్లు స్పష్టం చేశారని కేసీఆర్ తెలిపారు.