మియాపూర్ భూముల రక్షణ: సుప్రీం కోర్టులో విజయం సాధించామన్న సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Telangana
సుప్రీం కోర్టులో అత్యంత బలమైన వాదనలు వినిపించి మియాపూర్ ప్రాంతంలోని యాభై వేల కోట్ల రూపాయల విలువైన సుమారు ఐదువందల యాభై ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడగలిగామని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఖాతా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, కోర్టుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడి విజయం సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.