మర్రిపాడులో భారీ వర్షం వేళ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడులో ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇన్చార్జి సీఐ అన్వర్ భాషా, ఎస్సై బలరాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకలను పర్యవేక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకున్నారు.