కొండపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా స్వామి
రిపోర్టర్: గోపి
స్థలం: ప్రకాశం
ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, జరుగుమల్లి మండలం నర్సింగోలు మరియు కె. బిట్రగుంట గ్రామాల్లో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఈ పర్యటనను అత్యంత విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు అన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.