ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర మీ కుటుంబానికే ఉందంటూ రాహుల్ గాంధీపై అరవింద్ ధర్మపురి ధ్వజం

రిపోర్టర్: సతీష్ స్థలం: Nizamabad

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర తన తండ్రి, నాయనమ్మ కాలం నుంచే ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ Arvind Dharmapuri తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చి పాలిస్తున్న భారతీయ జనతా పార్టీపై నిరాధార ఆరోపణలు చేయడం తగదంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో కుటుంబ పాలన సాగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే నైతిక హక్ కు ఆ పార్టీకి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.