వాయనాడ్ అభివృద్ధి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రియాంక గాంధీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Wayanad

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్ సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాయనాడ్ పరిధిలోని కల్పేట్టలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె సమీక్షించారు. అధికారులతో చర్చించి పలు కీలక దిశానిర్దేశం చేశారు.