పులివెందుల హింసపై లోతుగా విచారణ జరపాలంటూ ఎస్ఈసీకి తెదేపా ఫిర్యాదు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
పులివెందుల మున్సిపాలిటీలో జరిగిన హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆధ్వర్యంలోని తెదేపా నాయకుల బృందం సోమవారం కోరింది. ఎన్నికలను అడ్డుకోవడానికి వైకాపా నాయకులు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఎస్ఈసీకి ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. రీపోలింగ్ నిర్వహించిన కేంద్రాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.