ఆదివాసీలు సంప్రదాయాలను కాపాడుకుంటూ విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
రిపోర్టర్: సతీష్
స్థలం: సిరికొండ
సిరికొండ మండలం నారాయణ్‌పూర్‌లో ఆర్పీజీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ ఆహార వైభవం కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సేంద్రియ ఎరువులు, ఆదివాసీ మహిళలు తయారు చేసిన 120 రకాల వంటకాలు, పూర్వకాలపు వ్యవసాయ పరికరాల ప్రదర్శనను ఆయన తిలకించారు.