కావలిలో 5 వేల మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
కావలి పట్టణంలో వినాయక చవితిని పురస్కరించుకుని 5,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. తెదేపా నేత తటవర్తి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పీవోపీ విగ్రహాలను వీడి పర్యావరణాన్ని పరిరక్షించే మట్టి గణపతులనే పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్ఫూర్తితో గత మూడేళ్లుగా ఈ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.