హైదరాబాద్‌లో రౌడీషీటర్ల గ్యాంగ్‌వార్‌లు.. నడిరోడ్డుపై దారుణ హత్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
రాజధానిలో రౌడీషీటర్ల కక్షలు, గ్యాంగ్‌వార్‌లు శాంతిభద్రతలకు సవాల్‌గా మారుతున్నాయి. నాగోలులో సెటిల్‌మెంట్ వివాదాలతో ఖమ్మం రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై వెంటాడి దారుణంగా హతమార్చడం భయానక వాతావరణం సృష్టిస్తోంది. మీర్‌పేటలో సూరి హత్య మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసుల నిఘా లోపాలు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతోనే నేరగాళ్లు హద్దు మీరి దాళులకు తెగబడుతున్నారు.