కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 25నే జీతాలు చెల్లింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల వేతనాలు, పెన్షన్‌ను ఐదు రోజుల ముందుగానే అంటే సెప్టెంబర్ 25వ తేదీనే ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సమ్మె ప్రభావంతో చెల్లింపులు ఆలస్యం కాకుండా ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.