చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీళ్లు సనాతనులను కదిలించాయి: సువేందు అధికారి

రిపోర్టర్: శివ స్థలం: పశ్చిమ బెంగాల్

బంగ్లాదేశ్‌లో కస్టడీలో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ తల్లి అంత్యక్రియలకు 5 గంటల పెరోల్‌పై హాజరై కన్నీళ్లు పెట్టుకోవడంపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్మోయ్ కన్నీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనవాదుల హృదయాలను కదిలించాయని పేర్కొన్నారు. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్‌ను జమాతీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.