కొండూరులో ఐక్యత చాటుతూ నూతన గౌడ సంఘం ఎన్నిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రాయపర్తి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో గౌడ సమాజ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా నూతన గౌడ సంఘ కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్గా పుల్ల ఎల్లాగౌడ్, ఉప సర్పంచ్గా పుల్ల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా పంతంగి యాకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన గౌడ బంధువులందరికీ నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతానికి, కుల బాంధవుల సంక్షేమానికి అందరినీ కలుపుకొని కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గౌడ కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.