శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పలాసలో అత్యధిక వర్షపాతం నమోదు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆర్బ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా తడిసి ముద్దయింది. అత్యధికంగా పలాసలో 112.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా కలెక్టర్ ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.