విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలపై అధికారుల తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. సరఫరా సజావుగా సాగేలా ఆదేశించినా పరిస్థితి మారకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీలను సైతం ఉపేక్షించబోమని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ కోతలకు గల కారణాలపై వెంటనే నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.