దసరా ప్రయాణికులకు భారీ షాక్: ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీల వసూలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో సాధారణ ఛార్జీల కంటే యాభై శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ సర్వీసులను ప్రత్యేక బస్సులుగా మార్చడంతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ప్రయాణికులు వాపోయారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని సంస్థ అదనపు ఆదాయ మార్గాన్ని ఎంచుకుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.