కుప్పం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కుప్పం
కుప్పం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఒక్కరోజే రూ. 11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, రాబోయే ఆరు నెలల్లో మరో రూ. 17,000 కోట్ల పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాలను గ్రోత్ ఇంజన్లుగా మలుస్తూ, 2027 నాటికి టిడ్కో గృహాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.