తిరుమలలో వైభవంగా సూర్య చంద్రప్రభ వాహనసేవలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మలయప్ప స్వామివారు సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శ్రీనివాసుడు విహరించారు. రాత్రి చంద్రప్రభ వాహనసేవ సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు ఘటాటోపం కింద స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో తితిదే ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు పాల్గొన్నారు.