రాజస్థాన్ లో ఘోర ప్రమాదం: విద్యుత్ షాక్ తో ఎనిమిది మంది కూలీలు దుర్మరణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Jhunjhunu

రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో జరిగిన ఘోర విద్యుత్ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు దుర్మరణం చెందారని ఉదయ్పుర్వాటి ఎస్ హెచ్ ఓ రాంపాల్ వెల్లడించారు. ఛపోలి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా యంత్రం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.