అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు గ్లేసియర్లు, శాస్త్రవేత్తల ఆందోళన!
రిపోర్టర్: గోపి
స్థలం: World
తూర్పు అంటార్కిటికాలోని లాంగ్‌హోవ్ గ్లేసియర్ వేగంగా కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉపరితల మంచు కరగడం వల్ల ఏర్పడే నీరు గ్లేసియర్ అడుగుభాగ చేరి ఒత్తిడిని పెంచుతోందని పరిశోధనలో తేలింది. దీనివల్ల గ్లేసియర్ వేగం 10 నుండి 20 శాతం వరకు పెరిగింది. తీవ్రమైన వేడి కారణంగా మంచు వేగంగా కరిగి సముద్రంలో కలుస్తోందని, ఇది సముద్ర మట్టాలు పెరగడానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.