విశాఖపట్నంలో భారీగా అక్రమ బంగారం పట్టుబాటు: ఎనిమిది కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడిందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కోల్కతా నుండి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న ఐదు కోట్ల ఎనిమిది లక్షల విలువైన ఐదు కిలోల పైచిలుకు బంగారాన్ని జాతీయ రహదారిపై నిఘా పెట్టి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని, ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది మరియు ఎవరికి చేరవేయాలనే అంశాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.