సంచలన ఘటన: క్వీన్ ఎలిజబెత్ కు వండిన వంటకంలో భారీ పొరపాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: చెన్నై

బ్రిటన్ రాణి ఎలిజబెత్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలో తనకు వండిన వంటకంలో జరిగిన పొరపాటును ప్రముఖ చెఫ్ వెంకటేష్ భట్ తాజాగా వెల్లడించారు. చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్ లో రాణి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో తాను చేసిన చిన్న తప్పు వల్ల ప్రాన్స్ సరిగ్గా ఉడకలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ అనుకోని సంఘటన తనను ఎంతగానో కుంగదీసిందని, ఆ సమయంలో జీవితంలో నేర్చుకున్నదంతా వ్యర్థమనిపించిందని సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ షోలో చెఫ్ వెంకటేష్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు.