ట్రంప్ పోస్టల్ బ్యాలెట్ ఆదేశాలను నిలువరించిన అమెరికా సుప్రీంకోర్టు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫెడరల్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లకు సంబంధించి మార్చిలో ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను కోర్టు నిలువరించింది. ఓటింగు పద్ధతులను ఏకపక్షంగా మార్చే అధికారం అధ్యక్షునికి లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుపై స్పందించిన ట్రంప్, తీర్పునిచ్చిన న్యాయమూర్తులు తాను నియమించినవారు కాదంటూ తీవ్రంగా విమర్శించారు.