రాజాపేటలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం!
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టు చేశారు. బకాయి బిల్లులు ఇవ్వకుండా అణచివేయడం హేయమైన చర్య అని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టులను మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్, సర్పంచి సంఘ అధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.