దేశంలోనే తొలి ఎల్ఎన్జీ డ్యూయల్ ఫ్యూయల్ రైలు ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: Sabarmati
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హితమైన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ దేశంలోనే తొలి లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో సబర్మతి డిపోలో ఈ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా సంప్రదాయ ఇంధన వాడుకం నాల్గవ వంతుకు పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.