ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల ఫీడ్ ధరలపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులకు ఊరటనిస్తూ రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫీడ్ ధరలను జూన్ 12న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారమే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.