విజయనగరంలో వైభవంగా తెలుగుదేశం పార్టీలోకి వంద కుటుంబాల చేరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

విజయనగరం పట్టణం 25వ డివిజన్‌కు చెందిన ఎర్ర ఎర్రినాయుడు, ఎర్ర లక్ష్మీ, ఎర్ర ప్రశాంత్ తో పాటు సుమారు 100 కుటుంబాల వారు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.