తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బాపట్ల

మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బాపట్ల జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అలజడిగా మారడంతో నిజాంపట్నం హార్బర్ వద్ద పదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.