అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్ల అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వారు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెంబడించి మరీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో అసెంబ్లీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.