పట్టణ సౌందర్యానికి పట్టం కడుతున్న పాలకుల సంకల్పం
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తోకాడ, లక్కరాజుపాలెం, కాపు జగ్గరాజుపేట, దువ్వాడ చెరువులు, 75వ వార్డు మహిళా థీమ్ పార్క్‌తో పాటు 50కి పైగా పార్కుల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులుతో కలిసి అభివృద్ధి ప్రతిపాదనలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అమృత్ పథకం కింద చెరువులు, పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.