వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రసిద్ధ పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ చారిత్రక జాతర జరగనుంది. సెప్టెంబర్ 30న ప్రధాన జాతర, అక్టోబర్ 1న అమ్మవారి నిమజ్జనం నిర్వహించనున్నారు. సంస్థానాధీశుల కాలం నాటి సంప్రదాయాలతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.