పొందూరు మండలం కింతలి పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కింతలిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల తయారీపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కాలుష్య రహిత వాతావరణం కోసం రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను పూజలకు వాడకూడదని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.