తుఫాన్ ప్రభావంతో నేలమట్టమైన ఇళ్లు ఆదుకోవాలని నేతల డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.మాడుగుల

అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో ఆర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని వర్షాలకు ఇళ్లు కూలిపోయి బాధితులు రోడ్డున పడ్డారు. లొంబూరి రవణబాబు ఇల్లు నేలమట్టం కావడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వందలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్జ వైకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.