ఉపాధ్యాయులపై దాడిని ఖండించిన మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడలో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైకాపా ఫ్యాక్షన్ ముఠాలు దాడికి పాల్పడటాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. గురువులపై క్రిమినల్ ముఠాలను ఉసిగొల్పడం మాజీ సీఎం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని, దాడికి పాల్పడిన రౌడీషీటర్లు, గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.