దిల్లీలో కిడ్నాప్ కలకలం: మూడు గంటల్లోనే బాలుడిని రక్షించిన పోలీసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: దిల్లీ

దిల్లీలో పదమూడేళ్ల బాలుడిని అపహరించిన ఘటనలో నిందితుడిని మూడు గంటల్లోనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాద్రాలోని జ్యోతి నగర్ ప్రాంతంలో బాలుడు కన్పించకుండా పోయాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలభై వేల రూపాయల విమోచన క్రయం కోరినట్లు తేలింది. సైబర్ కేఫ్ ద్వారా డిజిటల్ ఆధారాలను సేకరించిన పోలీసులు, చాకచక్యంగా వలపన్ని నిందితుడిని పట్టుకుని బాలుడిని సురక్షితంగా రక్షించారు.