ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్: ఈనెల 30న పంపిణీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 30వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. విజయనగరం జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి పైగా లబ్ధిదారులకు గాను నూట పదమూడు కోట్ల రూపాయలు విడుదలైనట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు.