కుటుంబ సభ్యులకు చెప్పకుండానే జయతో పెళ్లి జరిగిందన్న అమితాబ్ బచ్చన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ షోలో తన వివాహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన కంటెస్టెంట్ అహెలీ రాయ్‌తో మాట్లాడుతూ.. తాము ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే హఠాత్తుగా పెళ్లి చేసుకున్నట్లు అమితాబ్ తెలిపారు. జయ బచ్చన్‌తో తన వివాహం కేవలం ఒక్క రోజులో నిర్ణయమైందని, పెద్దల అనుమతి లేకుండానే మరుసటి రోజు ఒక్కటయ్యామని ఆయన గుర్తుచేసుకున్నారు.