అఫ్గానిస్థాన్ సిరీస్ కోసం భారత జట్టు తీవ్ర ప్రాక్టీస్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కోసం భారత జట్టు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తిరిగి బరిలోకి దిగాడు. నెట్స్ లో బ్యాటర్లు, బౌలర్లు చెమటోడ్చారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో నవదీప్ సైనీ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ స్వల్పంగా గాయపడినప్పటికీ, త్వరగా కోలుకుని బయటకు వెళ్లాడు.