ఆమనగల్లు మార్కెట్ పీఠం దళితులకు కేటాయించాలని బాబా గళం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సీనియర్ దళిత నేత పసుపుల జంగయ్యకు కేటాయించాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఈ పదవి దళితులకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న జంగయ్యకు పదవి ఇవ్వాలని కోరారు.