నార్తుమోపూరు విలీన వ్యతిరేకత: ఎన్నికలు బహిష్కరిస్తామంటూ గ్రామస్థుల హెచ్చరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
అల్లూరు మండలంలోని నార్తుమోపూరు గ్రామాన్ని నగర పంచాయతీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే ఈ విలీనం చేపట్టారని వారు మండిపడ్డారు. శనివారం తెదేపా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామస్థుల నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నేతలు హామీ ఇచ్చారు.