మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ఫేక్ ప్రచారం దుర్మార్గం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న ఫేక్ ప్రచారాన్ని ఏషియన్ మహిళా కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఏపీ తరపున దేశానికి ప్రాతినిధ్యం వహించి, గోల్డ్ మెడల్ సాధించిన తనపై ఫేక్ అని దుష్ప్రచారం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల ప్రతిభను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.