ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: West Bengal

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీపై హక్కు కోసం రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈసీ పార్టీ పేరు, గుర్తును తాత్కాలికంగా నిలిపివేసి కొత్త పేర్లు, గుర్తులను కేటాయించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ న్యాయపోరాటానికి దిగారు.