ఒడిశాలో అరుదైన ఒరాంగుటాన్ శిశువుకు తీవ్ర జ్వరం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఒడిశా

ఒడిశాలోని నందన్‌కానన్ జూ పార్క్‌లో క్వారంటైన్‌లో ఉన్న ఐదు ఒరాంగుటాన్ శిశువుల్లో ఒకటి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. వాతావరణ మార్పులు మరియు ఒత్తిడి కారణంగానే జ్వరం వచ్చినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. దీని ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదుగు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.